
అమరావతి, 25 డిసెంబర్ (హి.స.)
కొంతమంది దుర్మార్గులు పరమ పవిత్రమైన శ్రీశైల పుణ్యక్షేత్ర పరిధిలో తప్పుడు పనులు చేయడానికి సిద్ధమయ్యారు. భారీగా మాంసం, మద్యాన్ని క్షేత్ర పరిధిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. టోల్ గేట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... శ్రీశైలం టోల్ గేట్ వద్ద చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ