తనను పెళ్లి చేసుకోవాలన్న మహిళను కట్నంగా పాకిస్తాన్ కావాలన్న వాజ్ పేయ్
న్యూఢిల్లీ, 25 డిసెంబర్ (హి.స.) భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి జయంతి సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటనను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుర్తుచేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ... వాజ్పేయీ పాకిస్థాన్ పర్యటన
వాజ్పాయ్


న్యూఢిల్లీ, 25 డిసెంబర్ (హి.స.)

భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి జయంతి సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటనను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుర్తుచేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ... వాజ్పేయీ పాకిస్థాన్ పర్యటన సమయంలో ఆయన ప్రసంగాలకు ఆకర్షితురాలైన ఓ పాకిస్థాన్ మహిళ ఆయన వద్దకు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారా? అందుకు బదులుగా కశ్మీర్ను గిఫ్ట్ గా ఇస్తారా? అని అడిగిందని చెప్పారు. దీనికి వాజ్పేయీ స్పందిస్తూ నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే, కానీ కట్నంగా పాకిస్థాన్ కావాలి అని తన వాక్ చాతుర్యాన్ని ప్రదర్శించారని రాజ్నాథ్ వెల్లడించారు. ఈ మాటలతో ఆ మహిళ నోరు మూయించడంతో పాటు, వాజ్పేయీని 'వాచస్పతి'గా ఎందుకు కొనియాడతారో మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande