కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందం: బండి సంజయ్
హైదరాబాద్, 25 డిసెంబర్ (హి.స.) తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందాలు సాగుతున్నాయంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్లో
బండి సంజయ్


హైదరాబాద్, 25 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందాలు సాగుతున్నాయంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్పై రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష ఏమాత్రం సరైంది కాదని, వీరిద్దరి మధ్య కుదిరిన రహస్య ఒప్పందంలో భాగంగానే కావాలనే కేసీఆర్పై సానుభూతి కలిగేలా రేవంత్ మాట్లాడుతున్నారా? అని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ కంటే పెద్ద శని తెలంగాణకు ఎవరూ ఉండరని, కేటీఆర్కు అధికార పోయినా అహంకారం మాత్రం తగ్గలేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రుల పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర కేబినెట్లోని ఇద్దరు, ముగ్గురు మంత్రులు చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నారని, వారి అక్రమాలపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నామని సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే మంత్రుల భాగోతాన్ని బయటపెడతామని, కాంగ్రెస్ అవినీతిపై బీజేపీ సమరశంఖం పూరిస్తుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పాలన కూడా గత కేసీఆర్ బాటలోనే సాగుతోందని, జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా పారదర్శకతను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande