
ఖమ్మం, 25 డిసెంబర్ (హి.స.)
ప్రపంచవ్యాప్తంగా మనుషులు ప్రేమ ఆప్యాయతతో జీవించాలని, పాడిపంటలతో దేశం సుభిక్షంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండల పరిధిలోని బయ్యారం గ్రామంలో చారిత్రాత్మకమైన చర్చిలో గురువారం తెల్లవారుజామున ప్రత్యేక ప్రార్థనలు జరిపి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చారిత్రాత్మకమైన బయ్యారం చర్చి నిర్మించుకొని 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చర్చ్ కు చేరుకున్న సోదర సోదరీమణులందరికీ, స్నేహితులకు, రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు