
సిద్దిపేట, 25 డిసెంబర్ (హి.స.)
సిద్దిపేట పట్టణంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో గురువారం హరీష్ రావు బ్లాంకెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న గుడ్లు, బియ్యం తదితరాలను పరిశీలించి, వసతులపై వారి నుంచి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హరీష్ రావు మాట్లాడుతూ... గత ఐదు నెలలుగా విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు అందడం లేదని, అదే విధంగా మెస్ బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ అనాధ పిల్లలకు సరైన భోజనం కూడా అందించడం లేదని విమర్శించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు