
మేడ్చల్ మల్కాజిగిరి, 25 డిసెంబర్ (హి.స.)
యువత క్రీడల్లో రాణించాలని మేడ్చల్
నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఘట్కేసర్లోని గురుకుల్ కళాశాల మైదానంలో మల్లారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులను క్రీడల వైపు ప్రోత్సహించేందుకే క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 19న తన వైవాహిక జీవితానికి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు