
మహబూబ్నగర్, 25 డిసెంబర్ (హి.స.)
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్
మండలం పెద్దాయపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజేందిర బోయి పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన 6 మంది విద్యార్థులను షాద్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు