భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు : మంత్రి సీతక్క
ములుగు, 25 డిసెంబర్ (హి.స.) మేడారం మహా జాతర సందర్భంగా ముందస్తు మొక్కుల్లో భాగంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని, అభివృద్ధి పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క
సీతక్క


ములుగు, 25 డిసెంబర్ (హి.స.)

మేడారం మహా జాతర సందర్భంగా ముందస్తు మొక్కుల్లో భాగంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని, అభివృద్ధి పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పిఓ చిత్ర మిశ్రా తో కలిసి మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జంపన్న వాగు వద్ద ఉన్న స్నాన ఘట్టాలు నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, కొంగలమడుగు నుంచి జంపన్న వాగు వరకు రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande