
గోదావరిఖని, 25 డిసెంబర్ (హి.స.)
ప్రతి కుటుంబానికి అండగా
ఉంటాను, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇండ్లు కట్టించే బాధ్యత నాది అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్ అన్నారు. శుక్రవారం రామగుండం కార్పొరేషన్ పరిధిలో గోదావరిఖని పట్టణంలోని పలు డివిజన్ల లో ప్రజలను కలిసి వారి బాధలను అడిగి తెలుసుకొని ఆయన మాట్లాడారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.
ఇల్లు లేని వారికి ఇంటి సదుపాయాన్ని కల్పించడంతోపాటు ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ, రోడ్లు, స్ట్రీట్ లైట్స్, మంచినీటికి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు