ధర్మపురిలో దొంగల బీభత్సం.. రెండు దేవాలయాల్లో చోరీ
జగిత్యాల , 25 డిసెంబర్ (హి.స.) జగిత్యాల జిల్లాలో ధర్మపురిలో దొంగలు బుధవారం అర్ధరాత్రి దాటాక బీభత్సం సృష్టించారు. రెండు దేవాలయాల్లో తలుపులు బద్దలు కొట్టి చోరీకి పాల్పడి సుమారు కిలోన్నర వెండి ఆభరణాలను అపహరించుకుని వెళ్లారని ఆలయ అర్చకులు వెల్లడించార
ధర్మపురిలో దొంగలు


జగిత్యాల , 25 డిసెంబర్ (హి.స.)

జగిత్యాల జిల్లాలో ధర్మపురిలో దొంగలు బుధవారం అర్ధరాత్రి దాటాక బీభత్సం సృష్టించారు. రెండు దేవాలయాల్లో తలుపులు బద్దలు కొట్టి చోరీకి పాల్పడి సుమారు కిలోన్నర వెండి ఆభరణాలను అపహరించుకుని వెళ్లారని ఆలయ అర్చకులు వెల్లడించారు. ధర్మపురి పట్టణ శివారులో గల అక్కపెల్లి రాజేశ్వర స్వామి దేవాలయంతో పాటు పక్కన గల నరసింహ స్వామి టెంపుల్ లో సైతం గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రాజేశ్వర స్వామి టెంపుల్ లోని అమ్మవారి వెండి పానవట్టం, కవచమును అపహరించుకుని వెళ్లారు. చోరీకి గురైన వెండి ఆభరణాల విలువ సుమారు 3 లక్షల వరకు ఉంటుందని సమాచారం.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande