
పులివెందుల, 25 డిసెంబర్ (హి.స.)
క్రిస్మస్ పండుగ సందర్భంగా వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో సందడి చేశారు. స్థానిక సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రార్థన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జగన్ తో పాటు ఆయన తల్లి విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి సైతం చర్చికి విచ్చేశారు. వీరితో పాటు అభిమానులు మరియు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ప్రార్థనల అనంతరం జగన్ బయటకు వచ్చి తన అభిమానులు మరియు స్థానికులకు అభివాదం చేశారు. అక్కడ ఉన్నవారందిరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పలివెందులలో, చర్చి పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV