ఆళ్లగడ్డ మండలం.నల్ల.గంటల.లో.ఘోర రోడ్డు.ప్రమాదం జరిగింది
నంద్యాల:26 డిసెంబర్ (హి.స.) ఆళ్లగడ్డ మండలం నల్లగట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రావెల్స్‌ బస్సు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో వేగంగా దూసుకెళ్లిన కారు.. డివైడర్‌ను దాటి ఎదురుగా వస్త
ఆళ్లగడ్డ మండలం.నల్ల.గంటల.లో.ఘోర రోడ్డు.ప్రమాదం జరిగింది


నంద్యాల:26 డిసెంబర్ (హి.స.) ఆళ్లగడ్డ మండలం నల్లగట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రావెల్స్‌ బస్సు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో వేగంగా దూసుకెళ్లిన కారు.. డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. దీంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా హైదరాబాద్ వాసులుగా తెలుస్తోంది. మృతిచెందిన వారిని గుండురావు(60), శ్రావణ్ (22), నరసింహ, బన్నీగా గుర్తించారు. తోటి ప్రయాణికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను రక్షించి స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలాన్ని డీఎస్పీ ప్రమోద్ కుమార్ సైతం పరిశీలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande