
అమరావతి, 26 డిసెంబర్ (హి.స.)వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. అతి వేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏపీలో ఈ రోజు (శుక్రవారం) రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు.
గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు సూర్యాపేట ప్రాంతవాసులుగా సమాచారం. విషయం తెలుసుకున్న సౌత్ డిఎస్పి భానోదయ, సిఐ వంశీధర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను ప్రభుత్వం వైద్యశాల మార్చురీకి తరలించిన నల్లపాడు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ