
తిరుపతి, 26 డిసెంబర్ (హి.స.)
తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ (Bharatiya Vignan Sammelan) అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. వారికి కార్యక్రమ నిర్వాహకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రవేశ ద్వారం ద్వారా సమ్మేళన్ జరుగుతున్న ప్రాంగణంలోకి ఆర్ఎస్ఎస్ చీఫ్, సీఎం ప్రవేశించారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ సాంకేతిక నమూనాలను వారు పరిశీలించారు. వాటి గురించి విశేషాలను నిర్వాహకులు వివరించారు. అనంతరం సభా వేదికపైకి వారు చేరుకున్నారు. అక్కడ వేద మంత్రోచ్ఛారణతో సమ్మేళన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఎం చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV