
భద్రాద్రి కొత్తగూడెం, 26 డిసెంబర్ (హి.స.)
భద్రాద్రి భక్తులతో పోటెత్తింది. వరుస
సెలవు రోజులు కావడం, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతుండటంతో వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే రామయ్య దర్శనానికి బారులు తీరారు. క్యూ లైన్స్ నిండిపోయి, దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. రామయ్య అవతారాలలో భాగంగా శుక్రవారం శ్రీ స్వామి వారు నిజరూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. నిజరూపంలోని స్వామి వారిని దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో భద్రాద్రి భక్తాద్రిగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు