నేడు ఢిల్లీలో సీడబ్ల్యూసీ మీటింగ్.. హస్తినకు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.) ఈనెల 27న ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సమావేశం అనంతరం ఆయన రాష్ట్రంలోని పెండింగ్ అంశాలపై సంబంధిత శాఖల కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నట్లు సమా
సీఎం రేవంత్


హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.)

ఈనెల 27న ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సమావేశం అనంతరం ఆయన రాష్ట్రంలోని పెండింగ్ అంశాలపై సంబంధిత శాఖల కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈనెల 283 రాత్రి చేరుకుంటారని, ఆయన హైదరాబాద్ కు ఈనెల 29న జరిగే అసెంబ్లీ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande