
హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.)
నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ వివాహం చేసుకున్న దంపతుల మధ్య అనుమానాలు దారుణాంతానికి దారితీశాయి. నల్గొండ జిల్లా నివాసులైన త్రివేణి, వెంకటేష్ లు ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.
వెంకటేష్ భార్యపై అనుమానాలు పెంచుకుని వేధిస్తూ, త్రివేణి పుట్టింటికి వెళ్లిపోవడానికి కారణమైంది. ఆమెను తిరిగి హైదరాబాద్ తీసుకువచ్చిన కొద్ది రోజుల్లోనే దారుణ హత్యకు దిగాడు.
పిల్లల ముందే పెట్రోల్ పోసి త్రివేణిని నిప్పటించిన వెంకటేష్, అడ్డుకున్న కూతురిని కూడా మంటల్లో తోసేశాడు. వారి అరుపులు, కేకలు విని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే త్రివేణి మృతిచెందగా కూతురు స్వల్ప గాయాలతో బయటపడింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు