
హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.) ఇటీవల విమాన సేవల సంక్షోభం
కారణంగా నష్టపోయిన ప్రయాణికులకు రూ.10 వేల వోచర్ల (Votures) పంపిణీని ఇవాళ ఇండిగో (IndiGo) సంస్థ ప్రారంభించింది. ఫ్లైట్ బయలుదేరడానికి ముందు 24 గంటల్లోగా సర్వీసు రద్దైన వారికి డీజీసీఏ (DGCA) మార్గదర్శకాల మేరకు ప్రతి ప్రయాణికుడికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పరిహారం అందజేస్తున్నారు. అదే విధంగా టికెట్ డబ్బులను ఇప్పటికే 'ఇండిగో' రీఫండ్ చేస్తోంది. ప్రస్తుతం తమ దగ్గర ఉన్న కాంటాక్ట్ వివరాల ఆధారంగా నేరుగా వోచర్ల పంపిణీ జరుగుతోంది. అందరికీ త్వరలోనే వోచర్లు అందుతాయని ఇండిగో యాజమాన్యం ప్రకటించింది. ఇక ట్రావెల్ ఏజెంట్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా బుక్ చేసిన వారికి కూడా ఇండిగో వారితో సంప్రదించి వివరాలు సేకరించి వోచర్లు అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..