
నంద్యాల, 26 డిసెంబర్ (హి.స.)
శుక్రవారం తెల్లవారుజామున నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల- బత్తలూరు వద్ద ఓ కారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రాదంలో స్పాట్‌లోనే నలుగురు మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో మరణించిన నలుగురు వ్యక్తులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. వీరు ఇటీవలే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా..నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల- బత్తలూరు వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి..డివైడర్‌ను దాటుకొని అవతలవైపు రోడ్డులో వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించారు. ఇక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ బస్సు మాత్రం డ్యామేజ్ అయిందని పోలీసులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తుండగా.. ఆ బస్సులోని ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపారు పోలీసులు.
ఇక ప్రమాదం జగరడంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు క్రేన్ సహాయంతో రోడ్డుకు అడ్డంగా పడిన కారును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV