మళ్ళీ క్రాష్ అయిన నెట్ ఫ్లిక్స్..
హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.) ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిక్స్ మరోసారి క్రాష్ అయింది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు సాయంత్రం నెటిక్స్లో విడుదల కావడంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులు ఒకేసారి స్ట్రీమింగ్ చేయ
Netflix


హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.)

ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిక్స్ మరోసారి క్రాష్ అయింది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు సాయంత్రం నెటిక్స్లో విడుదల కావడంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులు ఒకేసారి స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ భారీ ట్రాఫిక్ కారణంగా నెటిక్స్ సర్వర్లు ఓవర్లోడ్ అయి కొద్దిసేపు క్రాష్ అయ్యాయి. చాలా మంది యూజర్లు Something went wrong అనే ఎర్రర్ మెసేజ్ చూసి సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేశారు. డౌన్స్టిటెక్టర్ ప్రకారం వేల సంఖ్యలో రిపోర్టులు నమోదు అయ్యాయని పేర్కొంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande