ముగిసిన కస్టోడియల్ విచారణ.. జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి ప్రభాకర్ రావు రిలీజ్
హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.) ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీల్ విచారణ నిన్నటితో ముగిసింది. ఈ క్రమంలోనే ఆయనకు సిట్ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి ఇవాళ తెల్లవారుజామున జూబ్లీహిల
ఫోన్ టాపింగ్ కేసు


హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.)

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీల్ విచారణ నిన్నటితో ముగిసింది. ఈ క్రమంలోనే ఆయనకు సిట్ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి ఇవాళ తెల్లవారుజామున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు. జనవరి 16న కేసుకు సంబంధించి నివేదికను సిట్, సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 19న ఆయన కస్టడీని నిన్నటి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు డిసెంబర్ 12న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ప్రభాకర్ రావును 14 రోజుల పాటు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని 9 మంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) సుదీర్ఘంగా విచారించింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande