
హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.) ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే కీలక
నిందితుడు ప్రభాకర్ రావుతో సహా రాధాకిషన్ రావు, భుజంగ రావు, ప్రణీత్ రావు, తిరుపతన్నలను సీపీ సజ్జనార్ నేతృత్వంలోని SIT సమగ్రంగా విచారించి కీలక సమాచారాన్ని సేకరించింది. అయితే, తాజాగా ఇదే కేసులో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, 'ఆరా' (AARAA) పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థాపకుడు షేక్ మస్తాన్కు SIT విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మస్తాన్ నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లనున్నారు. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్కు గురైన జాబితాలో సెఫాలజిస్ట్ 'ఆరా' మస్తాన్ పేరు కూడా ఉంది. ఈ మేరకు SIT ఆయనను విచారించి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు సిద్ధమైంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..