సంక్రాంతి రద్దీని .దృష్టిలో.ఉంచుకొని మరిన్ని.ప్రక్యేక రైళ్లు
అమరావతి, 26 డిసెంబర్ (హి.స.) హైదరాబాద్‌ సిటీ: సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నాండేడ్‌-కాకినాడ మార్గంలో... ప్రత్యేకరైలు (07452) నాందేడ్‌ నుంచి జనవరి 12న మధ్యాహ్నం 1.30
సంక్రాంతి రద్దీని .దృష్టిలో.ఉంచుకొని  మరిన్ని.ప్రక్యేక రైళ్లు


అమరావతి, 26 డిసెంబర్ (హి.స.)

హైదరాబాద్‌ సిటీ: సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

నాండేడ్‌-కాకినాడ మార్గంలో...

ప్రత్యేకరైలు (07452) నాందేడ్‌ నుంచి జనవరి 12న మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ(Kakinada)కు చేరుకుంటుంది. కాకినాడ (07453) నుంచి జనవరి 13న మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుంది. అలాగే, మచిలీపట్నం నుంచి ప్రత్యేకరైలు (07454) జనవరి 11, 18వ తేదీల్లో ఉదయం 10 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు రాత్రి ఎనిమిది గంటలకు వికారాబాద్‌ చేరుకుంటుంది. ప్రత్యేక రైలు(07455) వికారాబాద్‌ నుంచి జనవరి 11, 18 తేదీల్లో రాత్రి పది గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 8.15కి మచిలీపట్నం చేరుకుంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande