
హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.)
వరుస సెలవులు,వీకెండ్ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. క్రిస్మస్ తర్వాత ఆఫీసులు, కాలేజీలు, పాఠశాలలు తెరవడంతో ఒకేసారి సిటీ వైపు లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా పంతంగి, చౌటుప్పల్, కోర్లపాడు టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర జామ్లు ఏర్పడ్డాయి. నేషనల్ హైవే 65పై ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుంచి అబ్దుల్లాపూర్మెట్, హయత్నగర్, చౌటుప్పల్ ప్రాంతాల్లో బంపర్-టు-బంపర్ ట్రాఫిక్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు