
హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.)
దేశ శ్యాప్తంగా రైలు ఛార్జీలు పెంచుతూ ఇండియన్ రైల్వే ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి నుంచి పెంచిన రైలు ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ ఛార్జీల పెంపును రైల్వే అధికారులు నోటిఫై చేయగా.. 215 కి.మీ., దాటిన ప్రయాణానికి జనరల్ విభాగంలో ప్రతి కిలో మీటరుకు 1 పైసా చొప్పున, మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ, ఏసీ తరగతుల్లో ప్రతి కిలో మీటరుకు 2 పైసల చొప్పున ఛార్జీలు పెరిగాయి. తాజా ఛార్జీల పెంపుతో ఇదే సంవత్సరంలో రైల్వేశాఖ రెండుసార్లు ఛార్జీలను పెంచినట్లయింది. సబర్బన్ సర్వీసులు, సీజనల్ టికెట్ల ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవని అధికారులు వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు