వేములవాడలో భక్తుల రద్దీ.. తోపులాట
వేములవాడ, 26 డిసెంబర్ (హి.స.) దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయానికి శుక్రవారం భారీగా భక్తులు పోటెత్తారు. రాజన్నను దర్శించుకున్న భక్తులు అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొ
వేములవాడ


వేములవాడ, 26 డిసెంబర్ (హి.స.)

దక్షిణ కాశీగా పేరుగాంచిన

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయానికి శుక్రవారం భారీగా భక్తులు పోటెత్తారు. రాజన్నను దర్శించుకున్న భక్తులు అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం, బోనాలు చెల్లించడం అనవాయితీ. ఈ క్రమంలో వేకువజామున నుంచే వేలాది సంఖ్యలో భక్తులు బోనాలతో తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులను నియంత్రించడం, సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోనాలతో తరలివచ్చి గంటల కొద్ది క్యూలైన్లలో వేచి ఉన్నప్పటికీ అమ్మవారి దర్శన భాగ్యం కలగడం లేదని, చివరికి బయట నుండే అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని వెళ్తున్నట్లు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వాపోయారు. క్యూలైన్లలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో తోపులాట జరిగింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande