
కచ్ , 26 డిసెంబర్ (హి.స.)
గుజరాత్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. కచ్ జిల్లా భుజ్ సమీపంలో డిసెంబర్ 26 శుక్రవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు వచ్చాయి.. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భూకంప తీవ్రత 4.4 మాగ్నిట్యూడ్‌గా నమోదైందని, భూకంప కేంద్రం భుజ్ సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొన్నారు. తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో ఈ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యి, ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం తెలియలేదు.
భూకంపాలకు అత్యంత సున్నితమైన సీస్మిక్ జోన్–Vలో కచ్ జిల్లా ఉండటంతో ఇలాంటి ప్రకంపనలు తరచుగా సంభవిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. 2001లో ఇదే ప్రాంతంలో తీవ్ర భూకంపం సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV