
ఢిల్లీ, 26 డిసెంబర్ (హి.స.)
బాక్సింగ్ డేను ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న జరుపుకుంటారు. బాక్సింగ్ డే అంటే కిక్ బాక్సింగ్ డే కాదు. బహుమతులను బాక్సుల్లో పెట్టి ఇవ్వడాన్ని బాక్సింగ్ డే అంటారు. అయితే ఇది ఎలా వచ్చిందంటే.. క్రిస్మస్ తర్వాతి రోజు పేదలకు, సేవకులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో బ్రిటన్‌లో పాతకాలంలో ధనవంతులు బహుమతులు, డబ్బు, ఆహారం పెట్టిన బాక్స్‌లను పంచేవారు. అలాగే చర్చిల్లో క్రిస్మస్ సమయంలో సేకరించిన విరాళాల పెట్టెలను ఈ రోజున తెరిచి అవసరమైన వారికి అందించేవారు. సేవకులు క్రిస్మస్ రోజున పని చేసినందుకు మరుసటి రోజు వారికి సెలవు, బహుమతులు ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది. కాలక్రమంలో అదే బాక్సింగ్ డేగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో బాక్సింగ్ డేను షాపింగ్ ఆఫర్లు, క్రీడా పోటీలు, కుటుంబ సమయంతో జరుపుకుంటూ, గివింగ్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV