
, నర్సాపూర్:, 27 డిసెంబర్ (హి.స.) నర్సాపూర్ డిపోలో డ్రైవర్ల కొరత వేధిస్తోంది. ప్రస్తుతమున్న బస్‌లకే సరిపోవడం లేదు. మరికొద్ది రోజుల్లో కొత్తగా బస్సులు వచ్చే అవకాశం ఉంది. వాటిని ఎలా నడపాలో అర్థం కాక ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్న వారిపై అదనపు భారం మోపుతున్నారు.
నర్సాపూర్‌లో డిపోను మూడేళ్ల క్రితం ప్రారంభించారు. 27 సంస్థ సర్వీసులు(ఇవన్నీ పల్లెవెలుగులే), 3 అద్దెవి(నిర్వాహకుల చోదకులే) ఉన్నాయి. వీటికి సంస్థ పరంగా కండక్టర్లు ఉంటారు. డిపో ప్రారంభంలో అన్నీ పాత డొక్కు బస్సులనే అందుబాటులో ఉంచగా అవి క్రమంగా శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని తొలగిస్తూ 15 వరకు కొత్తవి పంపారు. దీంతో మొత్తం 27 బస్సులున్నాయి. వీటిని నడిపేందుకు 36 మంది డ్రైవర్లున్నారు. ఇద్దరు మెడికల్ లీవ్‌లో ఉన్నారు. మిగిలింది 34 మంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 44 మంది అవసరం ఉండగా ఇంకా 10 మంది తక్కువగా ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ