
మహబూబాబాద్, 27 డిసెంబర్ (హి.స.) మహబూబాబాద్ జిల్లా లో తరచూ సర్వర్ డౌన్ తో మీసేవ, ఈ సేవ సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. జనన, మరణ, ఆదాయ,కులం ఇతర ధ్రువీకరణ పత్రాలు కోసం స్థానిక ప్రజలు ఆన్లైన్ లో సర్టిఫికెట్ పొందేందుకు మీసేవ, ఈ సేవ సెంటర్ లకు దరఖాస్తు చేసుకోవడానికి రావడంతో అవి మొరాయిస్తున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. నిత్యం విద్యార్థులు, రైతులు తమ అవసరాలకు సర్టిఫికెట్ల కోసం మీసేవ సెంటర్ల వద్ద సర్వర్లు మొరాయించడంతో పడిగాపులు కాస్తున్నట్లు, నెలలు కావస్తున్నా అధికారులు ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
అధికారులు దృష్టి పెట్టి మీ సేవ, ఈ సేవ సర్వర్లను పునర్ధరించి, ప్రజలకు సేవ లు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు