నా రాజీనామాకు కారణం కార్యకర్తలే : దానం నాగేందర్
హైదరాబాద్, 27 డిసెంబర్ (హి.స.) బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్టీ ఫిరాయింపు కేసులు, డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్లు ఎదుర్కొంటున్న సమయంలో తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని సెన్సేషనల్ ప
దానం నాగేందర్


హైదరాబాద్, 27 డిసెంబర్ (హి.స.)

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్టీ ఫిరాయింపు కేసులు, డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్లు ఎదుర్కొంటున్న సమయంలో తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని సెన్సేషనల్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కావాలంటే తాను రాజీనామా చేసి, ఉపఎన్నికలకు వెళ్లి, భారీ మెజారిటీతో మళ్ళీ గెలుస్తానని ధీమా కూడా వ్యక్తం చేసారు. అయితే తన ఈ నిర్ణయం వెనుక గల కారణాలను దానం మీడియాతో పంచుకున్నారు. రాజీనామా చేయడానికి, అవసరమైతే ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి తనకున్న ధైర్యం పార్టీ కార్యకర్తల నుంచే వచ్చిందని అన్నారు.

రాజీనామా చేయడానికి ధైర్యం కార్యకర్తలే, ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా కార్యకర్తలే అని ఆయన వ్యాఖ్యానించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande