
హైదరాబాద్, 27 డిసెంబర్ (హి.స.)
హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ లో ప్రయాణికులకు సౌకర్యంగా స్లీపింగ్ పాడ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సేవ రైలు ఆలస్యం అయినప్పుడు లేదా రాత్రివేళ విశ్రాంతి అవసరమైన ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనుంది. ఎయిర్ కండిషన్డ్ ఉండే ఈ స్లీపింగ్ పాడ్స్ లో ప్రైవేట్ స్పేస్, వై-ఫై, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, బెడ్, లైటింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఛార్జీల విషయానికి వస్తే 2 గంటలకు రూ.200, 24 గంటలకు రూ.1,200గా నిర్ణయించారు. హోటల్ రూమ్ల తో పోలిస్తే తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన విశ్రాంతి లభించడంతో దీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఇది మంచి ఉపశమనం కలిగిస్తుందని ప్రయాణికులు అంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు