
ఏలూరు, 27 డిసెంబర్ (హి.స.)
:రైలు ప్రయాణికుల ఛార్జీలు పెంచుతూ భారతీయ రైల్వే శాఖ ఈ నెల 21న ప్రకటించింది. పెంచిన ధరలను శుక్రవారం నుంచి అమలులోకి తీసుకొచ్చారు. రిజర్వేషన్ చేయించుకున్న వారి ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని, ధరలు ప్రకటించిన రోజున రిజర్వేషన్ చేసుకుని 26వ తేదీ నుంచి ప్రయాణాన్ని కొనసాగించేవారికి వర్తిస్తాయని ప్రకటించారు. సబర్బన్, నెలవారీ సీజన్ టిక్కెట్ల వారికి ధరల పెరుగుదల వర్తించదు. 215 కిలోమీటర్లలోపు ఆర్డినరీలో ప్రయాణాన్ని కొనసాగించే వారికి ఎలాంటి ధరల పెంపు లేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ