
అమరావతి, 27 డిసెంబర్ (హి.స.)
అమరావతి,: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు(ఆదివారం) షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. అయోధ్య రామ జన్మభూమిలోని శ్రీ రాముడు దర్శనం చేసుకోనున్నారు సీఎం చంద్రబాబు. మూడు గంటల పాటు అయోధ్యలో శ్రీ రాముని సన్నిధానంలో ఉండనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ