
నంద్యాల, 27 డిసెంబర్ (హి.స.)నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. రాష్ట్రం నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి తరలివస్తున్నారు. వీకెండ్ కావడంతో భక్తుల తాకిడి మరీ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో శ్రీశైలం వీధులంతా కూడా శివ నామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం దేవస్థానానికి తరలివస్తున్నారు. దీంతో దేవస్థానం క్యూలైన్లు భక్తులతో నిండిపోతున్నాయి. మల్లన్న భ్రమరాంభల దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా క్యూలైన్లలో ఉండే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలియజేశారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV