
హైదరాబాద్, 27 డిసెంబర్ (హి.స.)
నిర్దేశిత గడువు లోపల తమ ఆస్తుల
వివరాలు సమర్పించకపోతే కఠిన చర్యలు తప్పవని IAS అధికారులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 2025 క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించిన ఆస్తుల వివరాలను తప్పనిసరిగా జనవరి 31, 2026లోపు SPARROW ఆన్లైన్ మాడ్యూల్లో సమర్పించాలని స్పష్టం చేసింది. డిసెంబర్ 23, 2025న డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం సమర్పించాలని, గడువు తర్వాత ఆన్లైన్ మాడ్యూల్ ఆటోమేటిక్గా మూసివేయబడుతుందని తెలిపింది.
ఈ గడువులోగా వివరాలు సమర్పించని అధికారులకు విజిలెన్స్ క్లియరెన్స్ నిరాకరణ, ప్రమోషన్లు నిలిపివేయడం, క్రమశిక్షణ రాహిత్యం వంటి కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. గతంలో ఆన్లైన్ ఫైలింగ్ పెరిగినప్పటికీ, ఇకపై గడువును కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన All India Services (Conduct) Rules, 1968 ప్రకారం అమలులో ఉందని, పారదర్శకత, అక్రమ సంపాదన నివారణకు ఇది కీలకమని DoPT పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..