
హైదరాబాద్, 27 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించి, దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దేందకు ఇప్పటికే సమగ్ర ప్రణాళికను రూపొందించింది. ఈ క్రమంలోనే 30 సర్కిళ్ల సంఖ్యను 60కి పెంచిన నేపథ్యంలో ఆ సర్కిళ్లకు తాజాగా జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ల ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో రెండు, మూడు రోజుల్లో వారు బాధ్యతలు చేపట్టబోతున్నారు.
ఇటీవల 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషరన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో నగర విస్తీర్ణం 650 చదరపు కిలో మీటర్ల నుంచి సుమారు 2,053 చదరపు కిలో మీటర్లకు పెరిగింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు