జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలి.. హరీష్ రావు
హైదరాబాద్, 27 డిసెంబర్ (హి.స.) ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కల్పిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. తమ హక్కుల కోసం పోరాడుతున్న జర్నలిస్టులను అరెస్ట్ చేయించడం దుర్మార్గమని హరీశ్ రావు అన్నారు. వెంటనే అందరినీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బ
హరీష్ రావు


హైదరాబాద్, 27 డిసెంబర్ (హి.స.)

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కల్పిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. తమ హక్కుల కోసం పోరాడుతున్న జర్నలిస్టులను అరెస్ట్ చేయించడం దుర్మార్గమని హరీశ్ రావు అన్నారు. వెంటనే అందరినీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు 26 వేలకు పైగా అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చామని, రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ఇచ్చామని గుర్తు చేశారు. కానీ, నేడు కాంగ్రెస్ సర్కారు వచ్చాక అక్రెడిటేషన్ కార్డులను ఏకంగా 10 వేలకు తగ్గించారని కామెంట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.252ను వెంటనే సవరించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande