ఆడపిల్లల గురించి మాట్లాడడానికి మీకు ఏమి హక్కు ఉంది? నాగబాబు
హైదరాబాద్, 27 డిసెంబర్ (హి.స.) మహిళల వస్త్రాదరణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత, నటుడు నాగబాబు స్పందించారు. శివాజీ తన టార్గెట్ కాదని కానీ మన సమాజంలో మోరల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మత ఉందన్నారు. మగ అహంకారంతో ఉన్న మన సొసైటీ ఆడపిల్లలు ఎలా
నాగబాబు


హైదరాబాద్, 27 డిసెంబర్ (హి.స.)

మహిళల వస్త్రాదరణపై నటుడు

శివాజీ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత, నటుడు నాగబాబు స్పందించారు. శివాజీ తన టార్గెట్ కాదని కానీ మన సమాజంలో మోరల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మత ఉందన్నారు. మగ అహంకారంతో ఉన్న మన సొసైటీ ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే విషయాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఆడపిల్లల గురించి మాట్లాడటానికి మీకు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. కొందరు మహిళలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నారని అది వాళ్ల మనసులో నుండి వచ్చింది కాదన్నారు. ప్రపంచంలో ఫ్యాషన్ మారుతుందని వాళ్లు ఎలాగైనా ఉండొచ్చన్నారు. ఆడపిల్ల కాబట్టి ఇలానే ఉండాలని అనుకోవడం తప్పన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande