
నల్గొండ, 27 డిసెంబర్ (హి.స.)
జీవో 252 సవరణకు డిమాండ్ చేస్తూ చేపట్టిన శాంతియుత నిరసనకు జర్నలిస్టులు భారీగా తరలివచ్చారు. జీవో సవరణకు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, డెస్క్, కేబుల్, ఇండిపెండెంట్ జర్నలిస్టులు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఐక్య నిరసన చేపట్టారు. జీవో 252లో స్పష్టతలేని నిబంధనలను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. 'మీడియా అక్రిడిటేషన్ కార్డు-మీడియా కార్డు రెండు కార్డుల విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాటిలైట్, కేబుల్ టీవీ ఛానళ్ల అక్రిడిటేషన్లలో భారీ కోతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు