
హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.)తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో మూడు పోలీస్ కమిషనరేట్ లలో మార్పులు చేశారు అధికారులు. మూడు కమిషనరేట్ లను 12 జోన్ లుగా విభజించారు. వాటిల్లో హైదరాబాద్ లో 6 జోన్ లు, సైబరాబాద్ లో 3 జోన్ లు, రాచకొండలో 3 జోన్ లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ లో కలవనున్న శంషాబాద్, రాజేంద్ర నగర్ జోన్లు ఇక పై శంశాబాద్ ఎయిర్పోర్ట్ సైతం హైద్రాబాద్ కమీషనరేట్ లో భాగం కానుంది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు