ప్రజల్లో ఐక్యతా భావం పెంపొందాలి: డోర్నకల్ ఎమ్మెల్యే
మహబూబాబాద్, 28 డిసెంబర్ (హి.స.) సర్వ మతాల సారం ఒక్కటేనని, మానవులంతా సమానమేనని అందరూ కలిసికట్టుగా ఉండి శాంతి సమానతలను పాటించాలని, ప్రేమ, కరుణ, జాలి ఇవి మాత్రమే మానవ మనగడకు మూలాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎంఎల్ డాక్టర్ రామచంద్రునాయక్ అన్నారు. క్రైస
డోర్నకల్ ఎమ్మెల్యే


మహబూబాబాద్, 28 డిసెంబర్ (హి.స.) సర్వ మతాల సారం ఒక్కటేనని,

మానవులంతా సమానమేనని అందరూ కలిసికట్టుగా ఉండి శాంతి సమానతలను పాటించాలని, ప్రేమ, కరుణ, జాలి ఇవి మాత్రమే మానవ మనగడకు మూలాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎంఎల్ డాక్టర్ రామచంద్రునాయక్ అన్నారు. క్రైస్తవుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, నిరుపేద క్రిస్టియన్ మైనార్టీలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. శనివారం రాత్రి ఆయన మరిపెడ మండల కేంద్రంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రైస్తవులకు విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆవేశం మనిషికి శత్రువు లాంటిది..ప్రేమతో దానిని జయించాలన్నారు. ప్రధానంగా ప్రజల్లో ఏకతా భావం పెరగాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande