త్యాగాల పునాదులపై నిర్మితమైంది కాంగ్రెస్ పార్టీ..వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హనుమకొండ, 28 డిసెంబర్ (హి.స.) త్యాగాల పునాదులపై నిర్మితమైంది కాంగ్రెస్ పార్టీ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జెండా
వర్ధన్నపేట ఎమ్మెల్యే


హనుమకొండ, 28 డిసెంబర్ (హి.స.)

త్యాగాల పునాదులపై నిర్మితమైంది కాంగ్రెస్ పార్టీ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర దేశ స్వాతంత్ర్య సమరంలో మొదలై నేటి ప్రజాస్వామ్య పరిరక్షణ వరకు ప్రజల ఆశయాలతో ముడిపడి ఉందని అన్నారు.

త్యాగాలు, బలిదానాలు, ప్రజా ఉద్యమాల పునాదులపై నిర్మితమైన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, బడుగు బలహీన వర్గాలు మరియు మైనార్టీల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగిందని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande