
రాజన్న సిరిసిల్ల,28 డిసెంబర్ (హి.స.)
జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలో ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసి, దేశ స్వాతంత్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కొనియాడారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరికి కాంగ్రెస్ పార్టీ 140 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత దేశ ప్రజలకు అండగా 140 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని, గాంధీ నేతృత్వంలో స్వంతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు