జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి
జగిత్యాల, 28 డిసెంబర్ (హి.స.) జగిత్యాల జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి మండల కేంద్రంలో టవేరా, బైక్ ఢీ కొనడంతో దంపతులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్ర
రోడ్డు ప్రమాదం


జగిత్యాల, 28 డిసెంబర్ (హి.స.)

జగిత్యాల జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి మండల కేంద్రంలో టవేరా, బైక్ ఢీ కొనడంతో దంపతులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామానికి చెందిన లచ్చవ్వ(48) లింగయ్య(50) దంపతులు బైకుపై వెళుతుండగా వేగంగా వచ్చిన టవేరా వాహనం వీరి బైక్ను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో దంపతులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande