విమానంలో RDX అమర్చినట్లు మెయిల్.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తం
హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.) ఇండిగో విమానాలకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆదివారం కొచ్చి, జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వస్తున్న విమానాల్లో RDX అమర్చినట్లు గుర్తు తెలియని అగంతకుడి నుంచి మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది
శంషాబాద్ ఎయిర్పోర్ట్


హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.) ఇండిగో విమానాలకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆదివారం కొచ్చి, జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వస్తున్న విమానాల్లో RDX అమర్చినట్లు గుర్తు తెలియని అగంతకుడి నుంచి మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఎయిర్పోర్ట్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే 30 సార్లకు పైగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయని అధికారులు నిర్ధారించారు. బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఆ అగంతకుడు ఎవరు? అని దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande