ఢిల్లీకి వెళ్లిన మంత్రి..కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ తో కీలక సమావేశం
హైదరాబాద్, 27 డిసెంబర్ (హి.స.) తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం 7 గంటలకు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ తో వారు సమావేశమవుతారు. ఈ సమావేశంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల
మంత్రి ఉత్తం


హైదరాబాద్, 27 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్

కుమార్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం 7 గంటలకు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ తో వారు సమావేశమవుతారు. ఈ సమావేశంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు కోసం విజ్ఞప్తి చేయనున్నారు. ఇప్పటికే పర్యావరణ విచారణలు పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు పెండింగ్లో ఉన్నందున దీనిపై దృష్టి సారించనున్నారు. అలాగే ఇతర పెండింగ్ ప్రాజెక్టులు కూడా చర్చకు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది. ఏపీ చేపట్టనున్న నల్లమల సాగర్ పై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande