
హైదరాబాద్, 27 డిసెంబర్ (హి.స.) తెలంగాణ నీటి హక్కులను వాడుకోవడంలో సీఎంగా కేసీఆర్ ఫెయిల్ అయ్యారని మంత్ర జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఓ మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ.. నీళ్ల విషయంలో కేసీఆర్ అనేక తప్పిదాలు చేశారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికే పాలమూరు పై ప్రేమ ఉన్నట్లుగా నటిస్తున్నారని కామెంట్ చేశారు. పదేళ్ల పాటు ప్రజలకు కేసీఆర్కు అధికారాన్ని కట్టబెట్టారని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేవలం పంప్ హౌస్ ను ప్రారంభించి ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్లుగా చెప్పారంటూ సెటైర్లు వేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..