
భద్రాద్రి కొత్తగూడెం, 27 డిసెంబర్ (హి.స.)
మారుమూల అటవీ ప్రాంతంలోని
గిరిజన గ్రామం పూసుకుంటను విద్యా, వైద్య, వ్యవసాయ మరియు సంక్షేమ రంగాల్లో ఒక ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పూసుకుంట గ్రామంలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ తోటలను సందర్శించి, ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. అలాగే లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు పట్టాలు,రైతులకు పవర్ స్ప్రేయర్లు, పిండి మిల్లులు పంపిణీ చేశారు. శ్రీరామనవమి నాటికల్లా పూసుకుంట రోడ్డు పనులు పూర్తి అవ్వాలని ఆర్ అండ్ బి అధికారులకు ఆదేశించారు అనంతరం పూసుకుంట కామ సమస్యలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు