
తెలంగాణ, 27 డిసెంబర్ (హి.స.)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున ఏటీఎం (ATM) దొంగలు రెచ్చిపోయారు. రెండు వేర్వేరు బ్యాంకు ఏటీఎంలలో చోరీకి యత్నించి, మెషీన్లు తెరుచుకోకపోవడంతో దుండగులు వాటిని తగలబెట్టేశారు. ఈ ఘటనతో సుమారు రూ.37 లక్షల నగదు బూడిదైపోయింది.
దుండగులు ముందుగా సాయినగర్ లోని ఎస్బీఐ ఏటీఎంపై దాడి చేశారు. అయితే, మెషిన్ను ఎలాగైన తెరవాలని గ్యాస్ కట్టర్తో ప్రయత్నించగా అందులోని సమారు రూ.10 లక్షల నగదు పూర్తిగా కాలిపోయింది.
అనంతరం ఆర్యనగర్ లోని డీసీబీ బ్యాంకు ఏటీఎంపై కూడా ఇదే తరహా ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా ప్రయత్నం విఫలం కావడంతో మెషిన్ దగ్ధం కావడంతో రూ.27 లక్షల నగదు దగ్ధమైంది. మొత్తంగా రెండు ఏటీఎంలలో కలిపి రూ.37 లక్షలకు పైగా నగదు అగ్నికి ఆహుతైంది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు